Magazines

స్థిరంగా బంగారం ధరలు..

10 గంటల క్రితం

Gold
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దీపావళి పర్వదినం (ఆదివారం) సందర్భంగా దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వారాంతపు సెలవుతో పాటు పండుగ కారణంగా మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో నేడు కార్యకలాపాలు నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో శుక్రవారం నాటి ముగింపు ధరలే మార్కెట్లో కొనసాగుతున్నాయి.

హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో నేటి ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,570 వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది. దేశంలోని చెన్నై, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు నమోదయ్యాయి. అయితే ఢిల్లీ, వడోదర వంటి నగరాల్లో మాత్రం ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్