Magazines

భార్యను కుర్చీకి కట్టేసి.. నిప్పంటించి చంపిన భర్త..

4 గంటల క్రితం

fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో కుర్చీకి కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా జగత్‌పూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. సుఖ్‌వీర్ సింగ్ అలియాస్ మోను తన భార్య సోనమ్‌పై అనుమానం పెంచుకున్నట్లు సమాచారం. ఈ విషయమై పలుమార్లు గొడవపడిటన్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోనమ్‌ను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఆమె సజీవదహనమై ప్రాణాలు కోల్పోయింది. ఘటన అనంతరం సుఖ్‌వీర్ సింగ్ తన పిల్లలను తీసుకుని పరారైనట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్