నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారులకు ఐబీఎం షాకిచ్చింది. తమ కన్సల్టింగ్ విభాగంలో పని చేస్తున్న చాలా మంది ఉద్యోగులకు అమెరికా వర్క్ వీసాలు, గ్రీన్ కార్డుల స్పాన్సర్షిప్ను నిలిపివేయాలని నిర్ణయించింది. విదేశాల్లోని ఐబీఎం కార్యాలయాలకు మారాలని లేదా ఉద్యోగాన్ని వదులుకోవాలని ఉద్యోగులకు తేల్చి చెప్పింది. డిసెంబర్ 31, 2026లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది (IBM H1B Visa). డిసెంబర్ 31, 2026ను చివరి పని దినంగా నిర్ణయించినట్లు సమాచారం (IBM Visa Sponsorship).
ఈ నిర్ణయం ఐబీఎం కన్సల్టింగ్ విభాగానికి మాత్రమే వర్తిస్తుంది (H1B Visa News). ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఐబీఎం యాజమాన్యం నిర్ణయంతో చాలా మంది భారతీయ ఐటీ నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. తమ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు ఉద్యోగులకు కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఇచ్చింది. వీసా స్పాన్సర్షిప్ను నిలిపివేయడానికి మారుతున్న వ్యాపార అవసరాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యత కారణమని ఐబీఎం తెలిపింది.






కామెంట్లు (0)