Magazines

రేషన్‌ కార్డు ఈ-కేవైసీ పూర్తిచేస్తేనే 'ఇందిరమ్మ జీవిత బీమా'

18 గంటల క్రితం

'Indiramma Life Insurance' is available only upon completing the e-KYC for the ration card.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం నమోదు ప్రక్రియకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకం కింద బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీలకు రూ.5 లక్షలు అందజేయనుంది. రేషన్‌ కార్డు నంబరే దరఖాస్తు సంఖ్యగా ఉపయోగించనున్నారు. నమోదుకు ఆధార్‌, రేషన్‌ కార్డు, ఓటీపీ ధ్రువీకరణ తప్పనిసరి. రేషన్‌ కార్డులకు ఈ-కేవైసీ పూర్తికాని కుటుంబాలు ముందుగా దానిని పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ-కేవైసీ పూర్తిచేసుకున్న కుటుంబాలనే పథకంలో నమోదు చేయనున్నారు. అర్హులను గుర్తించి, నమోదు ప్రక్రియలో తప్పులు లేకుండా చూసేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్