నవతెలంగాణ - హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 11 నుంచి 14 మధ్య రెండు రోజుల పాటు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమయ్యే యాత్ర గోదావరి పరీవాహక ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల మీదుగా సాగుతుందని తెలిపారు. ప్రాజెక్టుల పరిస్థితి, రైతుల సమస్యలను ప్రజలకు వివరిస్తామన్నారు. మరోవైపు నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు గంగుల తెలిపారు. కేసీఆర్ అరెస్టు జరిగిన అలుగునూరు లేదా నుస్తులాపూర్‌లో సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు సుమారు 50 వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
నవంబర్ 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర..
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)