Magazines

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మందికి గాయాలు

3 గంటల క్రితం

Lorry hits RTC bus, 20 injured
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి హైస్కూల్‌ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్