Magazines

మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

7 గంటల క్రితం

MLA Rajagopal Reddy makes sensational comments once again
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు అభివృద్ధికి నిధులు ఆపితే మరో కురుక్షేత్రం సృష్టిస్తానంటూ రేవంత్ సర్కార్‌ను హెచ్చరించారు. పదవుల కోసం ఎవరి ఇంటి చుట్టూ తాను తిరగనని కండబద్దలు కొట్టారు. బుధవారం నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి ఇవ్వకున్నా ఫర్వాలేదు కానీ అభివృద్ధికి నిధులు ఇవ్వండంటూ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే.. అక్కడ ఈ రాజగోపాల్ రెడ్డి ఉంటాడని అన్నారు. మునుగోడుకు సాగు నీరు తీసుకొచ్చి 3 కొడంగల్‌కి రూ. పది వేల కోట్ల కాకపోతే రూ. 20 వేల కోట్ల తీసుకెళ్లు కానీ.. మునుగోడుకి నిధులు అడిగితే ఆగ్రహం వ్యక్తం చేస్తావా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు. నువ్వేమి ముఖ్యమంత్రివి నీదేమీ భాష అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్