నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో అయిదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 40.2 ఓవర్లకు 185 పరుగులు చేసి భారత్ ముందు 186 పరుగుల లక్ష్యం ఉంచింది. భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కివీస్ జట్టును నియంత్రించారు. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (38; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్లెయిర్ టిక్నర్ (34; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (30; 51 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), డారిల్ మిచెల్ (28; 41 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. భారత బౌలర్లు అర్షదీప్ 4, గుర్నూర్ బ్రార్ 3, అన్షుల్ కాంబోజ్ 2, అక్షర్‌పటేల్ 1 వికెట్ తీశారు.
NZ Vs IND: భారత్ లక్ష్యం 186
24 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)