Magazines

కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం.. 14 మంది సీనియర్లపై సస్పెన్షన్‌

33 నిమిషాల క్రితం

Government
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : కామారెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ ఘటన కలకలం రేపింది. జూనియర్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ చేసినట్లు గుర్తించిన అధికారులు 14 మంది సీనియర్లపై సస్పెన్షన్‌ వేటు వేశారు. వీరిలో నలుగురిని ఆరు నెలల పాటు, మరో 10 మందిని నాలుగు నెలల పాటు సస్పెండ్‌ చేశారు. బాధిత విద్యార్థులు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) యాంటీ ర్యాగింగ్‌ సెల్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారాలను పరిశీలించిన అధికారులు కళాశాలలో ర్యాగింగ్‌ జరిగినట్లు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్