Magazines

అంతరిక్షం నుంచి ఓటేసిన వ్యోమగాములు..

25 నిమిషాల క్రితం

Astronauts who voted from space..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్‌ మీనన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో భాగంగా టెక్సాస్‌ రాష్ట్ర ఎన్నికలకు అంతరిక్షం నుంచే ఓటు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతరిక్ష కేంద్రంలోని తన వ్యక్తిగత గదిలో ల్యాప్‌టాప్‌ ద్వారా సురక్షిత ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌లో ఓటు నమోదు చేశారు.


అనంతరం నాసా సురక్షిత సమాచార వ్యవస్థ ద్వారా ఆ ఓటును భూమిపై ఉన్న ఎన్నికల అధికారులకు పంపించారు. తనతో పాటు మరో ఇద్దరు అమెరికా వ్యోమగాములు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు మీనన్‌ తెలిపారు. కాగా, వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు టెక్సాస్‌ శాసనసభ 1997లో చట్టం తీసుకొచ్చింది. అదే ఏడాది నాసా వ్యోమగామి డేవిడ్‌ వోల్ఫ్‌ తొలిసారిగా అంతరిక్షం నుంచి ఓటు వేశారు. సుదీర్ఘ అంతరిక్ష యాత్రల్లో ఉన్న వ్యోమగాములు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్