నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 27వరకు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉ.8.30గంటల వరకు భద్రాద్రి, ఖమ్మం, మహాబూబాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు పడతాయని వెల్లడిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, నకిరికల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, మహాబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.







కామెంట్‌లు (0)