నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ గత దశాబ్ద కాలంగా పాటిస్తున్న తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా భద్రతా దళాలతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ఈసారి ఆయన వేడుకల కోసం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన 'ఎక్స్' ఖాతాలో స్పందించారు. "మన ధైర్యవంతులైన భద్రతా బలగాలతో కలిసి దీపావళి జరుపుకోవడానికి బస్తర్‌కు వెళ్తున్నాను. ఒకప్పుడు నక్సలిజం ప్రభావం బలంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు అభివృద్ధి వర్ధిల్లుతోంది. దేశం కోసం వారు చేస్తున్న త్యాగాలు, నిస్వార్థ సేవ, అచంచలమైన భక్తికి సెల్యూట్ చేసేందుకే నేను వెళ్తున్నాను" అని పేర్కొన్నారు.
సైనికులతో ప్రధాని మోడీ దీపావళి..
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)