Magazines

'హైదరాబాద్ వాక్స్' ప్రచార టీషర్ట్‌లను ఆవిష్కరించిన ప్రభాస్

9 గంటల క్రితం

Hyderabad Walks
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ప్రభాస్‌ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రభాస్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంయుక్తంగా 'హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్' కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక టీషర్ట్‌లను ఆవిష్కరించారు. యువతలో విపరీతమైన అభిమానం ఉన్న ప్రభాస్ వంటి అగ్ర నటుడు ఈ అవగాహన ఉద్యమానికి మద్దతు తెలపడం ద్వారా సమాజంలో మరింత సానుకూల ప్రభావం పడుతుందని వారు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్