Magazines

ఇండోనేషియా ఉపాధ్యక్షుడి రాజీనామా

6 గంటల క్రితం

Resignation of the Vice President of Indonesia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఇండోనేషియా ఉపాధ్యక్షుడు గిబ్రాన్ రకాబుమింగ్ రాకా గురువారం తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. మాజీ అధ్యక్షుడు జోకో విడోడో కుమారుడైన రాకా, పార్లమెంట్ భవనంలోని పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ నాయకత్వానికి రాజీనామా లేఖ సమర్పించారు. విద్యార్హతలకు సంబంధించిన పత్రాలు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేవంటూ రాజ్యాంగ న్యాయస్థానం, సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడంతో ఆయన పదవిపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎనిమిది రాజకీయ పార్టీలకు చెందిన 120 మంది చట్టసభ సభ్యులు ఆయనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ వివాదానికి తెరదించేందుకు రాకా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇండోనేషియా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్ష పదవి ఖాళీ అయితే, అధ్యక్షుడు నామినేట్ చేసిన ఇద్దరిలో ఒకరిని 60 రోజుల్లోగా అసెంబ్లీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే రాకా రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారా లేదా అన్నది స్పష్టత లేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్