Magazines

అయ్యప్ప సొసైటీ అక్రమాల్లో రేవంత్‌ సోదరుల హస్తం: కవిత

1 గంట క్రితం

Ayyappa Society
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వే చేయించాలని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యప్ప సొసైటీలో సుమారు 750 అక్రమ నిర్మాణాలు జరిగాయని ఆరోపించారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులే దగ్గరుండి పర్మిషన్లు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములు, టీడీఆర్ అక్రమ దందాలు తప్ప సీఎం రేవంత్‌కు మరేమీ కనిపించడం లేదని ఆమె విమర్శించారు. ఈ వ్యవహారంలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే సర్వే ప్రారంభించాలనీ, అందుకు కాంగ్రెస్‌ సర్కార్‌కు నెల రోజుల సమయాన్నిస్తున్నామనీ, లేదంటే తమ పార్టీ కార్యకర్తలే అక్రమ కట్టడాలకు 'రెడ్ మార్క్' వేస్తారని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్