రూ.500 గ్యాస్ సిలిండర్.. లబ్ధిదారులకు కీలక సూచనలు

1 గంట క్రితం

Rs. 500 Gas Cylinder: Key Instructions for Beneficiaries
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందే లబ్ధిదారులు ఆధార్ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ జీవో 19 జారీ చేసింది. పథకం ప్రయోజనాలు అర్హులకే అందేలా లబ్ధిదారుల ఆధార్‌ను రేషన్ కార్డులతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది.

ఆధార్ లేనివారు నమోదు రసీదుతో పాటు బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్‌బుక్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, ఓటరు ఐడీ, ఉపాధి హామీ కార్డు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను సమర్పించవచ్చు.

ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ విఫలమైతే ఐరిస్, ఫేస్ రికగ్నిషన్, ఓటీపీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అవి కూడా పనిచేయని సందర్భాల్లో ఆధార్ క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరణ చేపట్టాలని అధికారులకు సూచించింది. అర్హులైన లబ్ధిదారులు పథకానికి దూరం కాకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్