కివీస్‌తో టెస్టు.. భారత్‌ 246 పరుగులకు ఆలౌట్‌

53 నిమిషాల క్రితం

Test against Kiwis.. India all out for 246 runs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 116/6తో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ మరో 130 పరుగులు జోడించింది. భారత బ్యాటర్లలో ధ్రువ్‌ జురెల్‌ (88) ఒంటరి పోరాటం చేశాడు. అతడికి ఆకాశ్‌దీప్‌ (29) సహకారం అందించాడు. కివీస్ బౌలర్లలో జేమీసన్ 4 వికెట్లు తీయగా, మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, జాకబ్ డఫీ తలో రెండు వికెట్లు పడగోట్టరు. భారత్‌ ఇంకా 110 పరుగుల వెనుకంజలో ఉంది. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్