నవతెలంగాణ - హైదరాబాద్ : ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో రాంచీ–పట్నా హైవే (NH-33)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్‌లోని నలందా జిల్లాకు చెందిన 14 మంది ప్రయాణిస్తున్న స్కార్పియో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతుల్లో ఉన్నారు. రామ్‌గఢ్‌లోని ప్రసిద్ధ రాజ్రప్ప ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారు.
ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)