నవతెలంగాణ-హైదరాబాద్ : జార్ఖండ్ సరాయికేలా ఖర్సావన్ జిల్లాలోని గమ్హరియా పోలీస్ స్టేషన్‌లో జరిగిన లైంగికదాడి ఘటనలో 15 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఓ మహిళ తన భర్తతో గొడవ పడ్డాక రక్షణ కోసం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అక్కడ వైర్‌లెస్ ఆపరేటర్‌గా పని చేస్తున్న నీరజ్ లక్రా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బయటకు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు 15 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. లైంగికదాడికి పాల్పడిన నీరజ్ లక్రాను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్ సాహు, కానిస్టేబుల్ సంతోష్ కుమార్ రాయ్‌ను కూడా అరెస్ట్ చేశారు.







కామెంట్‌లు (0)