నవతెలంగాణ - హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సదస్సు ఏర్పాట్లు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర కీలక పాలనాపరమైన అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.






కామెంట్‌లు (0)