Magazines

టీజీ సేఫ్ మెరుపుదాడులు..తొమ్మిది ఆహార తయారీ కేంద్రాలకు షోకాజ్ నోటీసులు

1 గంట క్రితం

TG SAFE
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) అధికారులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తాజాగా వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 20 ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. మసాలాలు, నూనెలు, పాల ఉత్పత్తులు, స్వీట్లు, ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాల్లో పోలీసులతో కలిసి 10 టీజీ సేఫ్ అధికారుల బృందాలు ఈ తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 5,555 కిలోల ఆహార పదార్థాలు సీజ్ చేసి.. వాటిని ధ్వంసం చేశాయి. అలాగే అవి కల్తీ జరిగాయనే సందేహంతో 21 ఆహార నమూనాలు సేకరించాయి.


ఆహార పదార్థాలను నేలపైనే నిల్వ చేయడమే కాకుండా.. ఫుడ్, నాన్ ఫుడ్ వస్తువులను కలిపి ఉంచడం పట్ల ఆహార పదార్థాల తయారీ కేంద్రం యాజమానులపై టీజీ సేఫ్ బృందాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే తొమ్మిది ఆహార తయారీ కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి. మరో రెండు కేంద్రాల్లో లోపాల ఉన్నట్లు గుర్తించాయి. దీంతో ఆ లోపాలను సవరించుకోవాలంటూ ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశాయి. ఇక తొమ్మిది తయారీ కేంద్రాల లైసెన్సులను సస్పెండ్ చేశాయి. తక్షణమే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆయా కేంద్రాల యాజమానులను టీజీ సేఫ్ అధికారులు ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్