మారుతి భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు వెంకటయ్య
నవతెలంగాణ-అచ్చంపేట
భవన నిర్మాణ కార్మికులు అందరూ కార్మిక శాఖ నుంచి లేబర్ కార్డులు తీసుకోవాలని మారుతి భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు వెంకటయ్య సూచించారు. శుక్రవారం పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ముందు లేబర్ అడ్డా లో కార్మికులకు లేబర్ కార్డు తీసుకునే విధానం, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాల గురించి కూలీలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కూలీలను ఉద్దేశించి మాట్లాడారు.. లేబర్ కార్డు కలిగిన కార్మికులకు కుటుంబంలో వివాహం ప్రోత్సాహానికి రూ.30 వేలు, పిల్లల చదువులకు రూ.30 వేలు, ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు, సహజ మరణం జరిగితే రూ. 2.లక్షలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అదేవిధంగా క్యాన్సర్, గుండె జబ్బులు, డయాలసిస్ లాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ప్రతినెల రూ.4500/-, లు, కార్మికుని భార్య ప్రసూతి (డెలివరీ) కీ రూ 30.వేలు ఆర్థిక సహాయం, రెండు కాన్పులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. కూలీలు లక్ష్మమ్మ, విజయ, సునీత, బాలయ్య, ఉన్నారు.






కామెంట్లు (0)