Magazines

అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

2 గంటల క్రితం

Anganwadis
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

- కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి

- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్

నవతెలంగాణ – అశ్వారావుపేట

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ విమర్శించారు. వారి ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. శుక్రవారం కొత్త నారంవారిగూడెంలో నిర్వహించిన అంగన్వాడీ టీచర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పౌష్టికాహారం, చిన్నారులకు ఆరోగ్య సేవలు అందిస్తూ నిరంతరం శ్రమిస్తున్న అంగన్వాడీ సిబ్బందిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.


నిత్యావసర వస్తువులు, వైద్యం, ఇంధన ధరలు పెరిగినా వేతనాలు పెరగక వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌కు కేటాయించే నిధుల్లో 60 శాతం కోత విధించిందని ఆరోపించారు. ఇప్పటికే పదవీ విరమణ చేసిన టీచర్లు, ఆయాలకు ప్రకటించిన రిటైర్మెంట్‌ ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదని పేర్కొన్నారు. అంగన్వాడీ సిబ్బందికి నెలకు కనీస వేతనం రూ.30 వేలు చెల్లించాలని, పీఆర్సీ, డీఏ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కృష్ణవేణి, సుజాత, ఉష తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్