Magazines

అండర్‌-19 ఆసియా కప్‌: భారత్‌ ఘన విజయం

1 గంట క్రితం

under19
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అండర్‌-19 ఆసియా కప్‌ వన్డే టోర్నీలో అఫ్గానిస్థాన్‌ పై 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. యువ భారత్‌కు 228 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ జట్టు ఆటగాళ్లు నోమన్‌ సలార్‌జాయ్‌ (51), షా ఫైజల్‌ (51) రహిమీ అర్ధశతకాలతో రాణించారు.


భారత బౌలర్లలో ఇషాన్‌ సూద్ అద్భుత ప్రదర్శన చేశాడు. 9 ఓవర్లలో 43 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆర్యన్‌ సవ్‌సానీ రెండు వికెట్లు తీయగా.. కావ్య పటేల్‌, యశ్‌వర్ధన్‌ చౌహాన్, అర్జున్‌ రాజ్‌పుత్‌ తలా ఓ వికెట్‌ తీశాడు.


లక్ష‍్య ఛేదనక దిగిన యువ భారత్.. రెండు వికెట్లు కోల్పోయి 35వ ఓవర్‌ లోనే ఆఫ్గాన్ నిర్ధేశించిన టార్గెట్‌ ను చేధించింది. ఓపెనింగ్ బ్యాటర్లు అదరగొట్టారు. ఆర్యవీర్ సెహ్వగ్ అర్ధ సెంచరీ కొట్టగా, కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయచందాని 93 పరుగులతో చెలరేగాడు. వీకే వినిత్ అర్ధ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. నవంబర్ 14న జరిగే ఫైనల్ పోరులో మరోసారి పాకిస్థాన్, ఇండియా టైటిల్ కోసం ఆమీతుమీ తేల్చుకోనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్