Magazines

నాచారం సర్కిల్‌లో ఆకస్మికంగా పర్యటించిన ఎంఎంసీ కమిషనర్ వినయకృష్ణారెడ్డి

1 గంట క్రితం

MMC Commissioner Vinaya Krishna Reddy made a surprise visit to Nacharam Circle
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నాచారం: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాచారం సర్కిల్, శక్తి సాయి నగర్ డివిజన్‌లో గోకుల్ నగర్ ఎఫ్‌సీఐ గోదాం ప్రధాన రహదారి పక్కన పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎంఎంసీ కమిషనర్ వినయకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ గోకుల్ నగర్ పార్క్, కొన్ని కాలనీలు, ఎఫ్‌సీఐ గోదాం ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. రోడ్డు పక్కన చెత్త పేరుకుపోవడంపై స్పందించిన కమిషనర్, చెత్తను తొలగించి కాలనీవాసులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం, అక్టోబర్ 15 నుంచి చెత్త తొలగింపు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్