నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కృషి ఫలితంగా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలంలో అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారు ఇండ్ల నిర్మాణాల కోసం ఎమ్మెల్యే భూమి పూజలు చేస్తున్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామ గ్రామాన పెద్ద మొత్తంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మండల ఎంపీడీవో పి సాయిలు గ్రామాల్లోకి వెళ్లి పరిశీలనలతో సమీక్షిస్తున్నారు. ఎమ్మెల్యే కృషి ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లతో ఆసరా లభిస్తోంది ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల్లో ఆనందాన్ని వ్యక్తం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కృషి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వానికి ఇందిరమ్మ లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వెళ్లిన ఇండ్లు మంజూరు కాలేదని కాంగ్రెస్ పార్టీతోనే ఇండ్లు మంజూరు అవుతున్నాయని ప్రతి గ్రామంలో ప్రజల్లో తమ ఆవేదన వ్యక్తం అవుతుంది. మొదటి విడత, రెండో విడత, మూడో విడత, ఈ విధంగా జుక్కల్ ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి అర్హులైన వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం మద్నూర్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా సభల్లో సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం నాడు ఎమ్మెల్యే శాఖాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేయగా పెద్ద తడగూరు గ్రామాన్ని ఎంపీడీవో పి సాయిలు సందర్శించి ఇందిరమ్మ ఇండ్లను సమీక్షించారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హాయంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కృషితో నియోజకవర్గంలో వేలాది ఇండ్లు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పథకం మంచి గుర్తింపును తీసుకువస్తుంది.






కామెంట్‌లు (0)