- ప్రజా సంఘాల నాయకుడు కిరణ్
నవతెలంగాణ-మల్హర్ రావు.
మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామ సమీపంలోని మేడారం హైవే పక్కన పెంచుతున్న మొక్కలను పడవేయడంపై సంబంధిత అధికారుల తీరుపై విచారణ జరిపి,బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి వాటిని పెంచాల్సిన బాధ్యత అధికారులపై బాధ్యత ఉన్నప్పటికీ,హైవే పక్కన పెంచుతున్న మొక్కలను పడవేయడం ఆందోళన కలిగించే విషయం. ప్రజాధనం, ప్రభుత్వ వనరులతో పెంచుతున్న మొక్కలను నిర్లక్ష్యంగా పడవేసి ఉంటే,అందుకు బాధ్యులైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అధికారుల బాధ్యతని,పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. మొక్కలను ఏ కారణంతో పడవేశారు? ఎవరి ఆదేశాల మేరకు ఈ చర్య జరిగింది?,దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లింది.? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలి.ప్రభుత్వ నిధులు,ప్రజాధనం వృథా కాకుండా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజాధనాన్ని కాపాడటం,పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతన్నారు.ఈ ఘటనపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.






కామెంట్లు (0)