ప్రత్యేక గ్రామసభలు.!
నవతెలంగాణ-మల్హర్ రావు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విబిజి రాంజి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీల వారీగా ఆయా గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన గత నాలుగైదు రోజులుగా మండలంలోని 15 జీపీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలు తీర్మానం ద్వారా రూపొందించుకుంటున్నారు. 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీజీ రామ్ జీ) పథకంలో భాగంగా నిర్వహించే ఈ గ్రామసభల్లో వ్యవసాయ శాఖ అధికారులు సైతం హాజరవుతున్నారు. ఎల్.ని.వో నేపథ్యంలో వాతావరణ అనుకూల పద్ధతులు పాటిస్తూ, పంటల సరళిలో మార్పులు చేయాలి.
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ నీటి అవసరం అయ్యే పంటలైన అపరాలు, చిరు ధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని, సహజ వనరుల సమర్థ వినియోగం, బయటి నుంచి రసాయన ఆధారిత వనరుల వాడకం నిరో ధించాలి. పంటల సాగు ఖర్చు తగ్గించాలి. ప్రకృతి వ్యవసాయం దిశలో రైతులను చైతన్యపరచాలి. నేల ఆరోగ్యం పెంపొందే సంరక్షణ పద్ధతులు, రైతులు సాగునీటి యాజమాన్యంలో బిందు, తుంపర్ల సేద్యం పద్ధతులు పాటించాలి. తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఫార్మర్స్ రిజిస్ట్రీ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పంటల నమోదు (క్రాప్ బుకింగ్), డిజిటల్ క్రాప్ సర్వే, ఫెర్టిలైజర్ యాప్ మొదలైన విష యాల గురించి రైతుల్లో అవగాహన కల్పించాలి.







కామెంట్‌లు (0)