Magazines

ఆ సిసి తెలియదంటున్నా స్వశకి మహిళలు.!

3 గంటల క్రితం

Swashakti Women
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజుపై విచారణ చేపట్టిన డిపిఎం వేణుగోపాల్ రెడ్డి.

నవతెలంగాణ-మల్హర్ రావు.

ప్రభుత్వం నుంచి స్వశకి సంఘాలకు వచ్చే సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ,సంఘాల బలోపేతానికి కృషి చేయాల్సిన వల్లెంకుంట క్లస్టర్ సిసి నాగరాజు గత నాలుగైదు నెలలుగా పట్టించుకోవడం లేదని, అసలు ఆ సిసి ఎవరో మాకు తెలియదంటూ,అతను ఏరోజు మావద్దకు వచ్చి మొఖం చూపలేదని మండలంలోని వల్లెంకుంట క్లస్టర్ పరిధిలోని కొండంపేట సాయికిరణ్ గ్రామైఖ్య సంఘం స్వశకి సభ్యులు పంచిక పొసక్క,కోమల,ఓడక్, కావటి లచ్చక్క,కోడారి రాజేశ్వరి,అక్కల సారక్క,ములుకల గట్టక్క,దండిగ లస్మక్కజగరి లలిత,యాదండ్ల స్వప్న,రవళి,రజిత,లక్ష్మీ ఆరోపించారు.సీసీపై వివోఏ ప్రమిలా ఇటీవల జిల్లా కలెక్టర్ కు చెసిన ఫిర్యాదు తోపాటు పలు ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాగరాజుపై గురువారం విచారణ చేపట్టడానికి వచ్చిన డిపిఎం వేణుగోపాల్ రెడ్డి,ఏపిఎం హనుమంతరావు లను చెప్పారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు సిసి సంఘం వివో మీటింగ్,గ్రామ సభలు,లోకష్ ,గ్రామ సంఘం పుస్తకాల ఆడిట్,సెర్ప్ ఆడిట్,మహిళల ఈకెవైసి తదితర పనులపై కన్నెత్తి చూడకపోగా విజిట్ చేసినట్లుగా మాత్రం టూడైరీలో తప్పుగా సమాచారం ఇస్తున్నట్లుగా తెలుస్తోందని వాపోయారు.ఈ సంఘటనలపై ఎప్పటికప్పుడు ఏపిఎం హనుమంతరావు, పామ్ డిపిఎం రవి దృష్టికి తీసుకపోయిన పట్టించుకోవడం లేదన్నారు.అయితే విచారణకు చేపట్టిన డిపిఎం,ఏపీఎంలు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.లోతుగా విచారణకు చేపట్టారా.? సిసి ఇచ్చే ముడుపులకు ఆశపడి తూతూమంత్రంగా చేపట్టారా.? అనేది తెలియాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్