Magazines

త్వరలోనే మోర్ఖండి బ్రిడ్జి పనులు ప్రారంభం

2 రోజుల క్రితం

Morkhandi Bridge work
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

రూ.1.86 కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో వంతెన నిర్మాణం

నవతెలంగాణ – బజార్‌హత్నూర్‌
మండలంలోని మోర్ఖండి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు త్వరలోనే పరిష్కారం చూపుతామని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ తెలిపారు. మోర్ఖండి బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఆర్‌అండ్‌బీ శాఖ నిధుల నుంచి రూ.1.86 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.


గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోర్ఖండి, కొల్హారి గ్రామాల ప్రజల రాకపోకల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెండు వంతెనల నిర్మాణానికి మొత్తం రూ.3.60 కోట్ల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఇందులో భాగంగా కొల్హారి వంతెన నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. మోర్ఖండి వంతెన నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల వారికి రాకపోకలు సులభతరమవుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గి, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డుబ్బుల చంద్రశేఖర్, విద్యాసాగర, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్