నవతెలంగాణ – నాచారం:
ఉమ్మడి చర్లపల్లి–కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీలో బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీకి చెందిన ప్రజలతో పాటు సమీప కాలనీల వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్థానికుల సహకారంతో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.







కామెంట్‌లు (0)