నవతెలంగాణ-ఆలేరు టౌను
పశువులకు ఇటీవల సోకుతున్న లంబీస్, కిండీస్ వ్యాధి పట్ల, పశు యజమానుల అప్రమత్తంగా ఉండాలని, డాక్టర్ ఎస్ వినీత తెలిపారు. ఆలేరు పట్టణంలో పశువైద్యశాల వద్ద నవతెలంగాణతో ఆమె సోమవారం మాట్లాడారు. పశువులు, దూడలలో చర్మంపై పెద్ద, పెద్ద దద్దులు వస్తున్నాయని,
అలాంటి పశువులను గమనించాలని కోరారు. దద్దుర్లు వచ్చిన పశువులను, దూడలను, ఆరోగ్యంగా ఉన్న పశువులకు దూరంగా ఉంచాలన్నారు.
పశువుల ఇమ్యూనిటీని బట్టి డిసీస్ ప్రభావం అంచనా వేయవచ్చని పేర్కొన్నారు.
ఇది అంటువ్యాధి అని, ఒక దూడ నుండి ఇంకొక దూడకు సోకే ప్రమాదం పొంచి ఉందన్నారు. వైరల్ డిసీస్ నేపథ్యంలో, వ్యాధి సోకిన పశువులపై దోమలు, ఈగలు వాలకుండా చూడాలన్నారు. వ్యాధికి ఖచ్చితమైన ట్రీట్ మెంట్ ప్రాపర్ గా ఉండదన్నారు. వ్యాధి సోకకుండా యాంటీబయోటిక్స్ మందులు ఇస్తామన్నారు. అందుకు గాను ఫార్మర్స్ ముందస్తుగా సమాచారమిచ్చి అప్రమత్తంగా ఉండాలన్నారు.
సంచార పశు వైద్యశాల 1962 నెంబర్ కు ఫోన్ ద్వారా పశు వైద్యం కొరకు సమాచార అందించినట్లయితే, ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడ పశు సంపదకు సమస్యల తలెత్తినట్లయితే, అక్కడ ట్రీట్మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిరోజు మూడు గంటలలోపు కాల్ చేసినట్లయితే పశువుల ట్రీట్మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉంటామని, మిగిలిపోయిన వాటికి మరుసటి రోజు వైద్యం అందేలా చూస్తామన్నారు. రైతుల అందించే సమాచారాన్ని
వెహికల్ సిబ్బంది ఫాలోఅప్ చేసుకుంటారని, టోల్ ఫ్రీ కాల్ చేయగానే మీ కంప్లైంట్ ఏంటి అన్నది రిజిస్టర్ చేయబడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్లు (0)