నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు మాజీ విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళిని చెన్నై పోలీసుల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అరెస్టు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొన్నాయి. ప్రయివేట్ పాఠశాలలకు లైసెన్సులు, ఇతర అనుమతులు మంజూరు చేయడానికి రూ. 100 కోట్ల అవినీతి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు ఇప్పిస్తామని హామీ ఇచ్చి ప్రయివేట్ విద్యాసంస్థల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై జరిపిన దర్యాప్తు అనంతరం ఈ అరెస్టు జరిగింది. 177 పాఠశాలలు ప్రభావితమయ్యాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
అన్బిల్ మహేష్ పొయ్యమొళి అరెస్ట్ పై డీఎంకే స్పందించింది. తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటోందని డీఎంకే విమర్శించింది.






కామెంట్లు (0)