Magazines

రైతు డిక్లరేషన్ అమలుపై రైతుల ఆందోళన

1 గంట క్రితం

Farmers' concern
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

అధికారంలో కొనసాగుతున్న ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో సోమవారం నాడు మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.


ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంగ్ మండల అధ్యక్షులు అశోక్ పటేల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం పట్ల రైతులు అన్ని రకాలుగా నష్టపోయారని ఎల్ నీనో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ కాకుండా అన్ని రకాల పంటలకు బోనస్ ప్రకటించాలని వ్యవసాయానికి 24 గంటలు కరెంటు సరఫరా చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ ప్రకటించిన ప్రకారం రైతులకు అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మద్నూర్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్