నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని సీతారాంపురం గ్రామంలో బాలల దినోత్సవం సందర్భంగా బాలల గ్రామసభ నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ భాస్కర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగి సమాజాన్ని రూపుదిద్దుతారని అన్నారు. విద్యా, వైద్యంతో పాటు వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేర్ నవీన్ రెడ్డి వార్డు సభ్యులు లలిత హైమా మాంగ్యా గ్రామ శాఖ అధ్యక్షుడు వేల్పుల మల్లయ్య లింగంపల్లి సోమయ్య శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)