Magazines

ప్రభుత్వ జూ. కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం 

8 గంటల క్రితం

Constitution Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ యూఐ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ..అంబేద్కర్‌ రాసిన అమృత ధారనే ఈ రాజ్యాంగమనీ, అదే ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు.


సీనియర్ అధ్యాపకులు డాక్టర్ మండలోజు నర్సింహస్వామి మాట్లాడుతూ..ప్రజాస్వామ్య విలువలను, పౌరుల హక్కులు, బాధ్యతలను ప్రజలకు తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

 

"సమానత్వపు బాటను చూపించి, స్వేచ్ఛా సౌభ్రాతృత్వాల స్ఫూర్తిని నింపినది, మన భారత రాజ్యాంగం.. మన దేశపు ఆభరణం!"


కామర్స్ అధ్యాపకులు మస్తాన్ మాట్లాడుతూ...డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనై రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. ఈ రాజ్యాంగంలో ఆర్టికల్స్ అన్ని మనకు రక్షణగా మనకు అండగా మనల్ని అభివృద్ధి పతంలో నడిపించే అంశాలను రూపొందించారనీ, స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వాడుకోవాలి తప్ప చట్ట విరుద్ధంగా వాడకూడదని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.


అనంతరం కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... "రాజ్యాంగం ఆమోదం: 1949 నవంబర్ 26. రాజ్యాంగం అమలు: 1950 జనవరి 26. రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన సమయం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు కాలం పట్టింది. ఈ రోజును సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు. స్వేచ్ఛను పొందుతున్నాము మరియు హక్కులను పొందుతున్నాము కానీ బాధ్యతలను మర్చిపోతున్నామని" వివరించారు. ఈ కార్యక్రమంలో NSUI నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రహిమాన్, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు ఎస్ శ్రీనివాస్, చిద్రురాల గోవర్ధన్, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్