Magazines

జూ. కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

3 గంటల క్రితం

Constitution Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నెల్లికుదురు

మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ వీరస్వామి తెలిపారు. ఈ మేరకు భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశిష్ట కృషి, రాజ్యాంగ పీఠికలోని ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల ప్రాథమిక హక్కులు మరియు విధుల గురించి విద్యార్థులకు అవగాహన  కల్పించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులందరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని, రాజ్యాంగంలోని మౌలిక విలువలను గౌరవిస్తామని, దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తామని రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సమాజంలో ఐక్యత, సోదరభావం, సమానత్వం పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ మర్సకట్ల అనిల్ కుమార్, పెద్దూరి వెంకటేశ్వర్లు అధ్యాపకులు బండి శ్రీనివాస్, నాగేశ్వరరావు, శ్రీనివాస్, బాబు, సుధాకర్ , సతీష్ అధ్యాపకేతర సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్