నవతెలంగాణ - నెల్లికుదురు
మండలంలోని ప్రభుత్వ మరియు ప్రయివేటు కార్యాలయాలలో, గ్రామ పంచాయతీలలో సర్పంచులు, ఉద్యోగస్తులు, ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకను నిర్వహించారు. ఎన్ఎస్ఎస్, ఎంపీడీవో, తాహసిల్దార్ కార్యాలయాలతో పాటు వివిధ గ్రామ పంచాయతీ కార్యాలయాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకల్పనకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశిష్ట కృషి చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ పీఠికలోని ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల ప్రాథమిక హక్కులు మరియు విధుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సమాజంలో ఐక్యత, సోదరభావం, సమానత్వం పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఆయ కార్యాలయ సిబ్బంది అధ్యాపక బృందం పాల్గొన్నారు.







కామెంట్లు (0)