Magazines

మునిగలవీడులో రాజ్యాంగ దినోత్సవం 

2 గంటల క్రితం

Constitution Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని మునిగలవీడు ప్రయిమరీ స్కూల్ లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని సర్పంచ్‌ బొల్లి కొండ చైతన్య నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కల్పించిందని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రజాస్వామ్య స్ఫూర్తి, క్రమశిక్షణ, దేశభక్తి అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పాపారావు ,నర్మదా, కళ్యాణి ,గ్రామ కార్యదర్శి భాష్పాంగ్ ,వెంకన్న , ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అలాగే టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్