నవతెలంగాణ - నెల్లికుదురు
మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించామని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తుళ్ల వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.. మానవ హక్కుల న్యాయ సమాజం కోసం అందరం కలిసికట్టుగా పోరాడి ముందుకు సాగుదామని పిలిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి లు జిల్లా ఉపేందర్, హెచ్ అశోక్ నాయకులు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ ఆలకుంట్ల సాయిలు పోరండ్ల గణేష్ చాగంటి రవి తుళ్ల వివేక్ రమేష్ నాయక్ తో పాటు కొంతమంది ఉన్నారు.







కామెంట్‌లు (0)