Magazines

రైతు సమస్యలపై సిపిఐ ధర్నా 

10 నవంబర్, 2026

CPI
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈదుల బిక్షం రెడ్డి, మండల కన్వీనర్ బుర్ర శేఖర్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతం నెలకొన్న కరువును జాతీయ విపత్తుగా పరిగణించాలన్నారు. అందుకు వరి రైతులకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి, మిరప రైతులకు ఎకరానికి రూ.50వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.


అనంతరం రైతు సమస్యలపై పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు జక్కల అంజయ్య, ఆకుల రఘుమయ్య, కొట్టాల సర్పంచ్ కల్లెట్ల లింగయ్య, ఏర్పుల సంజీవ, సత్యం, బాలకృష్ణ, కృష్ణయ్య, కర్ణాటి అంజయ్య, లింగయ్య, నారాయణ, అశోక్, శేఖర్, నల్లబోతు కొమురయ్య, యాదయ్య, వెంకటయ్య, రాజు, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్