నవతెలంగాణ-ఆలేరు టౌను
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాల్సిందేనని రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ సభ్యులు ముక్తకంఠంతో కోరారు. శుక్రవారం ఆలేరు పట్టణంలో బండ్రు శోభారాణి వసతి గృహం వద్ద అఖిలపక్ష కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తేనే ఆలేరు అభివృద్ధి చెందుతుందని వారు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా ఆలేరును రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోవడం విడ్డూరమన్నారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం అఖిలపక్ష కమిటీ తరఫున త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ పసుపునూరు వీరేశం, కో కన్వీనర్ రాచకొండ జనార్ధన్, చెక్క వెంకటేష్, మొరిగాడి చంద్రశేఖర్, నంద గంగేష్, వడ్డెమాను నరేందర్, తుంగ కుమార్, కామెడీకారి అశోక్, దయ్యాల సంపత్, పేరపు రాములు, ఎండి సలీం, ప్రస్తుతం ఆంజనేయులు , బెజాడి కుమార్, పద్మ సుదర్శన్, కళ్లెపు అడవయ్య, ఎలుగల కుమారస్వామి, మంచన మల్లేశం, గుండు మధు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)