Magazines

సోమేశ్వరాలయానికి పోటెత్తిన భక్తజనం!

09 నవంబర్, 2026

Someshwara Temple
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు..పూజలు

వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు..

నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీ సోమేశ్వరాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి కొలనుపాక గ్రామంతో పాటు పరిసర గ్రామాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో సందడిగా మారింది. గ్రామస్తులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.దీంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్