నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం బేతుపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా చేయూత పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సర్పంచ్‌గా గెలుపొందిన దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), తమ వార్డులన్నింటినీ కైవసం విషయం విధితమే. పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ వ్యవహారంలో తమను విస్మరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఎంపీడీవోను వివరణ కోరగా.. తనకు దీనితో ఎలాంటి సంబంధం లేదని దాటవేసినట్లు సర్పంచ్ వాపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా ఇలా ఏకపక్షంగా పత్రాలు అందజేయడంపై గ్రామస్తుల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.







కామెంట్‌లు (0)