నవతెలంగాణ-మర్రిగూడ
జిల్లా కేంద్రంలో ఈనెల 15 నుండి 18 వరకు జరిగే అఖిలభారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ రైతు సమస్యలపై జరుగుతున్న మహాసభలను ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఈ నెల 14 నుండి 16 అగ్రి షో నిర్వహించడం జరుగుతుందని,సాంకేతిక వ్యవసాయ పరికరాలపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని,రైతులు అగ్రి షో ను సందర్శించి వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కే రజిత,లక్ష్మమ్మ,పాలకూర యాదయ్య, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)