Magazines

ప్రజాసేవకు నిలువెత్తు రూపం డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్

4 గంటల క్రితం

Dr. Matta Dayanand Vijaykumar
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 2 నిమిషాల చదవడం

- వాట్సాప్ సందేశంతో పేదవాడి కష్టాన్ని తీరుస్తున్న జననేత

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజల పట్ల నిరంతరం స్పందిస్తున్న సేవా తత్పరత.  పదవులతో సంబంధం లేకుండా మానవత్వమే ప్రాతిపదికగా సాగుతున్న ప్రజాసేవ ​సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ ప్రజల పట్ల చూపిస్తున్న సేవాభావం,  మానవత్వం నిజంగా అభినందనీయం. నేటి రోజుల్లో సామాన్య ప్రజలు తమ సమస్యను నాయకుల దృష్టికి తీసుకెళ్లడానికి ఎన్నో ప్రయాసలు పడాల్సి వస్తుంది. ​కానీ సత్తుపల్లిలో డాక్టర్ దయానంద్ విజయకుమార్ తీరు ఇందుకు పూర్తిగా భిన్నంగా నిలుస్తోంది. ​ఎవరైనా సరే తమ సమస్యను వాట్సాప్ ద్వారా సందేశంగా పంపిస్తే  దానిని ఆయన కేవలం ఒక మెసేజ్‌గా చూడకుండా బాధ్యతగా స్వీకరిస్తున్నారు.


ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆవేదనను అర్థం చేసుకుని, వీలైనంత త్వరగా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి మార్గం చూపుతున్నారు. ఆయన దృష్టిలో సమస్య ఎంత చిన్నదైనా లేదా పెద్దదైనా సరే ఆ బాధలో ఉన్న మనిషి ఇబ్బందే డాక్టర్ దయానంద్ కు ముఖ్యం  ముఖ్యం. ప్రభుత్వ పథకాలు అందకపోయినా, వృద్ధాప్య పెన్షన్ సమస్యలు ఉన్నా, విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురైనా ఆయన వెంటనే స్పందిస్తున్నారు.


​అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు వైద్య సహాయం అందించడంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటున్నారు. ప్రజాసేవ అంటే కేవలం సభల్లో ప్రసంగాలు చేయడం, రాజకీయ పదవులు సంపాదించడం లేదా ఫోటోలకు పోజులివ్వడం మాత్రమే కాదు. నిజమైన ప్రజాసేవ అంటే కష్టంలో ఉన్న మనిషికి అండగా నిలబడి, కన్నీళ్లు తుడిచి, నేనున్నాను అనే ధైర్యాన్ని ఇవ్వడం.


​ఈ గొప్ప లక్షణాలే డాక్టర్ దయానంద్ ను సత్తుపల్లి ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.​ప్రతి సందేశం వెనుక ఒక పేదవాడి ఆశ, ఒక తల్లి ఆవేదన ఉంటాయని గుర్తించి స్పందించడమే నిజమైన నాయకత్వ లక్షణం. పెద్ద పెద్ద మాటలు చెప్పడం కంటే, కష్టకాలంలో పలికే ఓ మంచి మాట ప్రజల్లో శాశ్వత నమ్మకాన్ని నింపుతుంది.


​అలాంటి అచంచలమైన నమ్మకాన్ని తన నిరంతర స్పందన ద్వారా ప్రజల్లో కలిగిస్తున్నారు డాక్టర్ దయానంద్ విజయకుమార్. పదవులు ఉన్నప్పుడే కాకుండా, ఎలాంటి పదవులు లేకున్నా ప్రజల కష్టాలను తనవిగా భావించడం గొప్ప నాయకుడి లక్షణం. రాజకీయాలకు అతీతంగా మానవత్వానికి ప్రాధాన్యతనిచ్చే ఇలాంటి నాయకులు సమాజానికి ఎంతో అవసరం.


​వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఒక వాట్సాప్ సందేశంతో ప్రజల బాధను చేరుకునే మనసే ఆయన ప్రత్యేకత. మనిషికి మనిషి తోడుగా నిలవడమే నిజమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించే డాక్టర్ మట్టా దయానంద్  సేవలు మరింత విస్తరించాలి. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆయన ద్వారా మరింత సాయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ​ప్రజల సమస్యే తన సమస్యగా భావించే మంచి మనసున్న నాయకుడికి ప్రజల ఆశీస్సులే ఎప్పుడూ నిజమైన బలం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్