Magazines

ప్రయివేటు పాఠశాలలు విద్యా పేరుతో పేదవాళ్ల జీవితాలను పీడిచి పిప్పి చేస్తున్నాయి..

02 అక్టోబర్, 2026

tpa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : టిపిఏ ఏడవ జనరల్ బాడీ సమావేశం మహీంద్రా హిల్స్ లోని త్రిమూర్తి కాలనీలో సంఘం అడ్వైజర్ పల్లెల వీరస్వామి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా పల్లెల వీరస్వామి, ప్రొఫెసర్ ఎస్. తిరుపతిలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యను బోధిస్తేనే ప్రభుత్వ విద్య నెంబర్వన్ గా ఉంటుంది. విద్యా వ్యవస్థ భవిష్యత్తు వారి చేతిలో ఉంది. ప్రయివేటు పాఠశాలలు విద్యా పేరుతో పేదవాళ్ల జీవితాలను పీడిచి పిప్పి చేస్తున్నాయి. పదో తరగతి నుంచి డిగ్రీ కాలేజ్ వరకు ప్రభుత్వ విద్యను పనికిరానిదిగా జమ కట్టేవారు. ఆపై చదువులకు ప్రభుత్వ కాలేజీలలో ఎందుకు ఎగబడుతున్నారు. ఉపాధ్యాయులు అందరూ ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ డిగ్రీ కాలేజీలలో విద్యలో కూడా నాణ్యత పెరిగినప్పుడే ప్రయివేట్ స్కూల్స్ కాలేజీలు తమ దోపిడిని ఆపుతాయి. పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఒక మోస్తారు జీవితం గడపగలుగుతారు.


సంగం అడ్వైజర్ నాయకులు సతీష్ ,సిహెచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉచిత నాణ్యమైన విద్యను పూర్తిగా అందించే వరకు అన్ని ప్రయివేటు పాఠశాలలో, కాలేజీలలో విద్య హక్కు చట్టాన్ని పూర్తిగా పకడ్బందీగా అమలు చేయాలని, టీచర్లకు, సిబ్బందికి నామ్స్ జీవో) ప్రకారం జీతాలు ఇవ్వాలన్నారు.


నాయకులు రామగిరి ప్రకాష్ ఎస్ ఆనంద్ గారు మాట్లాడుతూ విద్యను అందించే విద్యా కేంద్రాలు, విద్యా కేంద్రాలుగానే ఉండాలి తప్ప వ్యాపార కేంద్రాలుగా మారవద్దు. బుక్స్, డ్రెస్సులు, స్టేషనరీ, బూట్లు అమ్మే వ్యాపార కేంద్రాలుగా ఉన్న స్కూల్ల పర్మిషన్లు రద్దు చేయవలసిందిగా కోరాలన్నారు.


ప్రభుత్వ విద్య బలోపేతం అయితే తప్ప, ఈ అన్ని సమస్యలు పరిష్కారం కావు అందుకే ప్రభుత్వ విద్యను బలోపేతం కోసం పోరాడుదాం అన్నారు.

నూతన కమిటీ ఎన్నిక జరిగింది తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ (TPA) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఏం. అజయ్ బాబు , ప్రధాన కార్యదర్శిగా బి. రఫీదు , కోశాధికారిగా జే. తానిషా ఉపాధ్యక్షులుగా: ప్రొఫెసర్ ఎస్. తిరుపతి రామగిరి ప్రకాష్, విజయ్, ఎస్ ఆనంద్, చంద్రమౌళి సహాయ కార్యదర్శులుగా నర్సింగ్ రావు ఏ నాగరాజ్ ఎస్ అశ్విన్ రేణుక సంధ్యలు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా : యాదగిరి పరశురాములు కిరణ్ కుమార్ ఏ ఎన్ గిరి స్వాతి లు ఎన్నుకోబడ్డారు.


tpa

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్