నవతెలంగాణ - హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ లో క్యారెట్ లేన్ గోల్డ్ డైమండ్స్ షాపులో భారీ చోరీ జరిగింది. సోమవారం తెల్లవారుజామున దొంగలు గోల్డ్, డైమండ్స్ షాపును టార్గెట్ చేసినట్లు సమాచారం. షాపు షట్టర్ను పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు భారీగా బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. షాపులోని సీసీటీవి కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. చోరీకి గురైన బంగారం, వజ్రాల విలువ ఎంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బోడుప్పల్ లో క్యారెట్ లేన్ గోల్డ్ షాపులో దొంగల బీభత్సం.. భారీగా నగలు చోరీ
05 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)