Magazines

హలో రైతన్న..ఛలో నల్లగొండ

2 గంటల క్రితం

Jeepu Jatha
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

36వ ఆల్ ఇండియా కిసాన్ మహాసభలను జయప్రదం చేయండి

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్. దేశ్యనాయక్ పిలుపు

నవతెలంగాణ-అచ్చంపేట
నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో 36వ ఆల్ ఇండియా కిసాన్ మహాసభలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశనాయక్ పిలుపునిచ్చారు. మహాసభల ప్రచారం సందర్భంగా ఏర్పాటుచేసిన జీపు జాత కార్యక్రమాన్ని గురువారం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ప్రారంభించారు.


ఈ సందర్భంగా దేశ్యనాయక్ మాట్లాడుతూ.. 4 రోజులపాటు జరిగే ఈ మహాసభలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రైతు సంఘం ప్రతినిధులు, జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కష్టజీవులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగం సంక్షోభం, రైతులకు గిట్టుబాటు ధరలు, పంటల నష్టాలు, రైతుల హక్కులు తదితర అంశాలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించి, భవిష్యత్తు రైతాంగ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పర్వతాలు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వర్ధం సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లేష్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ నాయక్, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నిర్మల, ఆర్టీసీ కార్మికులు ఎస్. వెంకటయ్య, పర్వతాలు, రాములు, వెంకటయ్య, గోపాల్  ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్