Magazines

దీపావళికి పిండి వంటలు లేనట్టేనా.!

07 నవంబర్, 2026

pastries for Diwali
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

దీపావళి అనగానే నోరూరించే తీపి వంటలు గుర్తుకొస్తాయి. కజ్జికాయలు, సున్నుండలు, బొబ్బట్లు, బూందీలడ్డూ ఇలా రకరకాల పిండి వంటలు ఇళ్లలో వండుకుంటారు. తీపి వంటలు చేయాలంటే పంచదార, గోధుమ పిండి, మైదా, కందిపప్పు, సెనగపప్పు తప్పనిసరి. ఈ వస్తువులు ఆర్థికంగా ఉన్న కుటుంబాలు కిరాణా దుకాణాల్లో కొని సంతోషంగా పండుగ జరుపుకొంటే పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారనుంది. సమాజంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వాలు చౌక ధరల దుకాణాల్లో బియ్యంతో పాటు సగం ధరలకే నిత్యావసరాలు పంపిణీ చేసేవి.


ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయి పాతికేళ్లు గడుస్తోంది. దసరా పండుగకు ఎలాగూ రాయితీపై నిత్యా వసర సరకులు పంపిణీ చేయని ప్రభుత్వం దీపావళికైనా పంపిణీ చేస్తుందని భావించిన వినియోగదారులకు నిరాశే మిగిలింది. రేషన్ దుకాణాల్లో పంచదార కూడా ఇవ్వడం లేదు.

నిత్యావసర సరకులు ఇవ్వాలి: చింతల తిరుమల గృహిణి

ప్రభుత్వం ఉచిత బియ్యంతో పాటు రేషన్ కార్డుపై చక్కెర, పిండి, కందిపప్పు, మంచినూనె సగం ధరకు ఇవ్వాలి. పేద కుటుంబాలకు బియ్యం ఒక్కటే ఇస్తే సరిపోదు. వంట చేసుకోవాలంటే అన్నీ వస్తువులు ఉండాలి. ప్రభుత్వం పేద కుటుంబాల గురించి ఆలోచించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్